16, మార్చి 2015, సోమవారం

వానా వానా వచ్చేనంట

చిత్రం : బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్ - కోటి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర

కోరస్:వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
        తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
        ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
        కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా
        వానా వానా వచ్చేనంటా.. వాగు వంకా మెచ్చేనంటా.. ఆ..ఆ
        ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...

అతడు : స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
ఆమె : సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అతడు : అల్లో మల్లో...
ఆమె: అందా....లెన్నో.. యాలో..ఓ..ఓ..యాల...

అతడు : స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
ఆమె : సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా...

అతడు : తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ..
ఆమె : మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా..
అతడు : కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ..
ఆమె : శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ..
అతడు : వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా..
ఆమె : సిగ్గు యెగ్గూ చెల్లెప్పా.. కాదయ్యో నీ గొప్పా..
అతడు : నీలో...మేఘం.. నాలో దాహం.. యాలో.. యాల...

అతడు : స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
ఆమె : సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా..

ఆమె : వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
          తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
అతడు : ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
           కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా
ఆమె : తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
అతడు : తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన..
ఆమె : జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన..
అతడు : చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
ఆమె : వానల్లోన సంపెంగ.. ఒళ్ళంతా ఓ బెంగా..
అతడు : గాలి వాన గుళ్ళోనా.. ముద్దే లే జేగంట..
ఆమె : నాలో.... రూపం.. నీలో తాపం... యాలో....యాల
అతడు : స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
ఆమె : సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అతడు : అల్లో మల్లో...
ఆమె : అందా....లెన్నో..
అతడు, ఆమె : యాలో..ఓ..ఓ..యాల...

కోరస్:వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
        తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
        ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
        కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా..